కరోనా లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేస్కుని ఓ ఇంటివాడైన యంగ్ హీరో నితిన్.. కొత్త ఏడాదిలోనూ వరుస సినిమాలను ప్లాన్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘రంగ్ దే’, ‘చెక్’, అంధాధున్ రీమెక్లో నటిస్తున్నాడు.
అయితే వాటిలో మొదటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న ‘రంగ్ దే’ రిలీజై, ఆ తరవాతే ‘చెక్’ వస్తుందని అనుకున్న్నారు . కానీ ప్లాన్ రివర్స్ అయింది. రంగ్ దే( మార్చి 26న విడుదల) కంటే ముందే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ‘చెక్’ సినిమా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ విడుదల తేదీని ప్రకటించింది.
ఫిబ్రవరి 19న ‘చెక్’ విడుదలవుతోంది. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా కనిపిస్తుండటం కూడ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.