తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల విస్తరణకు రూ.573.13 కోట్ల ప్రాజెక్టులను ఆమోదించినట్లు కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎన్‌హెచ్-163లోని హైదరాబాద్-భూపాలపట్నం సెక్షన్ విస్తరణ ప్రాజెక్ట్ విలువ రూ.136.22 కోట్లు. ‘ఈ రోడ్డు విస్తరణ వల్ల లక్నవరం, బొగత జలపాతం వంటి పర్యాటక ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుంది. అలాగే ములుగు జిల్లాలో లెఫ్ట్ వింగ్ ఎక్ట్సీమిజం ఎక్కువ. దాన్ని నియంత్రణలో ఉంచేందుకు కూడా ఈ రహదారి ఉపయోగపడుతుంది’ అని గడ్కరీ అన్నారు.ఎన్‌హెచ్-167కేలో తెలంగాణలోని నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నది మీద వంతెన కోసం చేపట్టే ప్రాజెక్ట్ విలువ రూ.436.91 కోట్లు.