వచ్చే నెలాఖరుతో పెళ్లి ముహూర్తాల తేదీలు ముగిసిపోతున్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ తర్వాత 5 నెలల గ్యాప్‌తో డిసెంబర్లోనే మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. లేదంటే వచ్చే సంవత్సరమే మళ్ళీ ముహూర్తాలు ఉంటాయని చెబుతున్నారు. గత ఏప్రిల్ నెలతో పాటు మే, జూన్ నెలల్లోనూ రికార్డు స్థాయిలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఆగస్ట్‌లో కొద్ది రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయని ఆపై మళ్ళీ డిసెంబర్ వరకూ వేచి ఉండాల్సిందేనని చెబుతున్నారు.