తన గత చిత్రం ‘కార్తికేయ–2’ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ.. నిఖిల్ తన లేటెస్ట్ మూవీ 18 పేజెస్ ను హిందీలో రిలీజ్ చేయడం లేదని చెప్పేశాడు. ఈ మూవీని కేవలం తెలుగు లాంగ్వేజ్ కోసమే సిద్ధం చేశామని, మూవీ అనుకున్నప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఆలోచన లేదని స్పష్టం చేశాడు. తెలుగులో మంచి స్పందన వచ్చిన ఈ మూవీకి హిందీలోనూ మంచిగానే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మేకర్స్ కూడా హిందీ రిలీజ్ పై దృష్టి పెట్టడం లేదు.