కేంద్రం: రామసేతు ఉన్నట్లు మా వద్ద ఆధారాలు లేవు

By udayam on December 24th / 5:33 am IST

రామసేతు మూలాలకు సంబంధించి ఎలాంటి కచ్చితమైన ఆధారాలను భారతీయ ఉపగ్రహాలు గుర్తించలేదని కేంద్ర భూగోళ శాస్త్రాల మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో తెలిపారు. రాజ్యసభలో ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘భారత్, శ్రీలంక ప్రాంతాలను అనుసంధానం చేసే రామసేతు ఫోటోలను భారతీయ ఉపగ్రహాలు హై రిజల్యూషన్‌తో తీశాయి. కానీ, అది ఉన్నట్టు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు దొరకలేదు’ అని ఆయన తన సమాధానంలో పేర్కొన్నారు.

ట్యాగ్స్​