పిల్లలపై ప్రభావం ఉండకపోవచ్చు : గులేరియా

By udayam on June 9th / 6:38 am IST

దేశంలో కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ పిల్లలపై కరోనా ప్రభావం చూపిస్తుందన్న డేటా లేదని ఎయిమ్స్​ చీఫ్​ డైరెక్టర్​ డాక్టర్​ రణదీప్​ గులేరియా శుభవార్త చెప్పారు. ‘ఇదొక తప్పుడు సమాచారం. కొవిడ్​–19 పిల్లలపై ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి సైద్దాంతిక ఆధారాలు మన వద్ద లేవు’ అని ఆయన వివరించారు. సెకండ్​ వేవ్​లోనే 60 నుంచి 70 శాతం చిన్నారులు కొవిడ్​ బారిన పడ్డారు. వారంతా కోలుకుని తిరిగి ఆరోగ్యవంతులయ్యారు. 3వ వేవ్​ వస్తుందా? వస్తే పిల్లలు ఎఫెక్ట్​ అవుతారా అన్న దానిపై ఎలాంటి ఆధారాలు లేవు అని ఆయన అన్నారు.

ట్యాగ్స్​