ఆప్​–బిజెపి కౌన్సిలర్ల వాగ్వాదం: నిలిచిపోయిన ఢిల్లీ మేయర్​ ఎన్నిక

By udayam on January 6th / 10:26 am IST

ఢిల్లీ కార్పొరేషన్​ సభలో అధికార ఆప్​, ప్రతిపక్ష భాజపా శ్రేణులు రెచ్చిపోయాయి. దీంతో ఈరోజు జరగాల్సిన మేయర్​ ఎన్నికను రిటర్నింగ్​ అధికారి వాయిదా వేశారు. డెస్క్​ లపైకి ఎక్కి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, పేపర్లు విసురుకోవడం చేయడంతో మేయర్​ ఎన్నిక జరగకుండా సభ వాయిదా పడింది. ఆప్​ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి శ్రేణులు అరవింద్​ కేజ్రీవాల్​ లకు వ్యతిరేకంగా సభలో పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్​యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఈ రచ్చ మొదలైంది. ఢిల్లీ ఎల్జీ నియమించిన నామినేటెడ్​ సభ్యులు మేయర్​ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధమవ్వగా ఆప్​ శ్రేణులు నినాదాలు చేయడంతో ఈ రచ్చ మొదలైంది.

ట్యాగ్స్​