తాజ్​ మహల్​ చూడాలన్నా కొవిడ్​ పరీక్ష తప్పనిసరట

By udayam on December 22nd / 1:07 pm IST

కరోనా కేసులు పెరుగుతుండడంతో తాజ్ మహల్ ను సందర్శించే పర్యాటకులకు యూపీ ప్రభుత్వం పలు కండిషన్లు జారీ చేసింది. ప్రతిరోజూ వేలాది మంది దేశీయ, వీదేశీ పర్యాటకులు తాజ్ మహల్ సందర్శనకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో, కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే తాజ్ సందర్శనకు అనుమతిస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజ్ ను చూడటానికి వచ్చేవాళ్లు సందర్శనకు ముందే కొవిడ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

ట్యాగ్స్​