ఈ ఏడాదీ చేప మందు లేదు

By udayam on May 26th / 10:34 am IST

హైదరాబాద్​లో ప్రతీ ఏటా ఆస్తమా రోగులకు పంపిణీ చేసే చేప మందును ఈ ఏడాదీ ఇవ్వడం లేదు. స్థానికంగా ఉండే బత్తిన గౌడ్​ కుటుంబం ప్రతీ ఏటా ఆస్తమా రోగులకు ఈ చేప మందు ప్రసాదాన్ని అందించేంది. అయితే 2020 లో వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా అప్పటి నుంచి ఈ చేప మందు పంపిణీని నిలిపివేసింది. ఇప్పుడు మహమ్మారి కంట్రోల్​లో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా లేమని బత్తిన కుటుంబం ప్రకటించింది. ఈ చేపమందు తీసుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రజలు హైదరాబాద్​కు వచ్చేవారు.

ట్యాగ్స్​