కశ్మీర్​ను వీడుతున్న హిందూ పండిట్లు

By udayam on June 3rd / 12:24 pm IST

జమ్మూ కశ్మీర్​లో కశ్మీరీ పండిట్లపై జరుగుతున్న వరుస దాడులకు భయపడి అక్కడి హిందువులను వ్యాలీని వీడి బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 18 మంది సాధారణ పౌరులను తీవ్రవాదులు కాల్చి చంపడంతో స్థానిక హిందువుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన 2 రోజుల్లో ఇక్కడ ఓ టీచర్​తో పాటు బ్యాంకు మేనేజర్​ను ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వంలో పనిచేస్తున్న హిందూ ఉద్యోగులు సైతం తమకు వేరే చోటకు ట్రాన్స్​ఫర్​ చేయాలని 2 రోజులుగా ధర్నా చేస్తున్నారు.

ట్యాగ్స్​