ఇస్లామిక్ ప్రపంచంలో సౌదీ కంటే తమకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలంటూ గట్టిగా పోరాడుతున్న టర్కీ ఈ క్రమంలో ఆ దేశం పేరును సైతం మార్చుకుంది. ఇకపై టర్కీ పేరును తుర్కియాగా మార్చాలంటూ పెట్టుకున్న అభ్యర్థనకు ఐరాస అంగీకారం తెలిపింది. గతేడాదే ఈ రీ బ్రాండింగ్ కార్యక్రమానికి ఆ దేశ అధ్యక్షుడు రెచప్ తయ్యప్ ఎర్డోవాన్ మొదలు పెట్టారు. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు ‘‘తుర్కియా’’ అనే పదం చక్కగా నప్పుతుందని గత ఏడాది డిసెంబరులో ఎర్దోవాన్ చెప్పారు.