తెలంగాణ: 10 దాటితే పబ్​లకు సౌండ్​ పర్మిషన్​ లేదు

By udayam on December 31st / 5:36 am IST

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పరిధిలోని 10 పబ్‌లకు రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సౌండ్‌ అనుమతి ఇచ్చేది లేదంటూ తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. పబ్‌లపై గతంలో హైకోర్టు ఈ ఆదేశాలివ్వగా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్స్‌ నిర్వాహకులు మరోసారి కోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గతంలో పబ్‌ల విషయంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. న్యూఇయర్‌ సందర్భంగా నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపింది.

ట్యాగ్స్​