కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, తెలంగాణ ప్రజల దశాబ్దాల కల ఇది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తుందని ఎన్నో ఏళ్లుగా ఆశలు పెట్టుకుంది కార్మికలోకం. అయితే, ఆ ఆశలను సమాధి చేసేసింది కేంద్రం. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదంటూ కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి రాజ్యసభలో శుక్రవారం లేవనెత్తారు. భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోయేలా.. కోచ్‌ల తయారీ సామర్థ్యం ప్రస్తుతానికి ఉందని, కాబట్టి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.