జడేజా: 20 ఏళ్ళలో కేటిఆర్​ ప్రధాని

By udayam on May 25th / 6:35 am IST

వచ్చే 20 ఏళ్ళలో కెటిఆర్​ భారత్​కు ప్రధాని కాగలరని వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ట్వీట్​ చేశారు. దావోస్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక ఫోరమ్​లో వీరిద్దరూ కలిసిన అనంతరం ఆమె కెటిఆర్​ విజన్​ను మెచ్చుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే 20 ఏళ్ళలో భారత్​కు కెటిఆర్​ ప్రధాని అయితే నాకెలాంటి ఆశ్చర్యం కలగదు. ఒక యువ రాజకీయ వేత్తకు ఇంతటి విజన్​ను నేనింతవరకూ చూడలేదు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్ననాయకుడు కెటిఆర్​’ అని ప్రశంసించారు.

ట్యాగ్స్​