అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎక్స్ ప్రెస్ ఎఫ్3 టికెట్ రేట్లను పెంచట్లేదని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే ఈ మూవీ టికెట్లను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, మురళీ శర్మ, సునీల్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఈనెల 27న విడుదల కానుంది. డబ్బు, దాని వల్ల వచ్చే సమస్యల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు.