ఉత్తర కొరియా ప్రజలపై తీవ్రమైన రూల్స్ పెడుతూ వారిని అష్టకష్టాలు పాల్జేస్తున్న ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరో తిక్క రూల్ను తీసుకొచ్చాడు. దేశంలోని యువత ఎవరైనా పాశ్చాత్య దేశాల సంస్కృతిని అనుసరిస్తూ టైట్ జీన్స్ కానీ, జట్టుకు రంగు కానీ వేస్తే, పిచ్చి పిచ్చి కొటేషన్స్ ఉన్న షర్టులు కానీ ధరిస్తే వారిని జైలుకు పంపిస్తానని హెచ్చరించాడు. గతేడాది మే నుంచే ఈ రూల్స్ తెచ్చినప్పటికీ తాజాగా ఇలాంటి వ్యక్తులను గుర్తించి జైలుకు పంతున్నారు.