మరోసారి బాలిస్టిక్​ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా

By udayam on October 1st / 7:28 am IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​ దక్షిణ కొరియా నుంచి తిరుగు ప్రయాణమైన వెంటనే ఆమెకు ‘గుడ్​ బై చెబుతూ’ నార్త్​ కొరియా రెండు బాలిస్టిక్​ క్షిపణులను ప్రయోగించింది. జపాన్​ సముద్రం వైపుగా ప్రయాణించిన అవి జపాన్​ స్పెషల్​ ఎకనమిక్​ జోన్​కు అవతల కూలిపోయాయి. ఈ క్షిపణి ప్రయోగాన్ని అటు దక్షిణ కొరియా, ఇటు జపాన్​ సైన్యం ధృవీకరించింది. శనివారం ఉదయం 6.45 గంటలకు మొదటిది, 7.03 గంటలకు రెండో క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించింది.

ట్యాగ్స్​