ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉ.కొరియా.. అమెరికానూ తకగలదన్న జపాన్​

By udayam on November 18th / 8:03 am IST

ఉత్తర కొరియా దూకుడు తగ్గడంలేదు. శుక్రవారం కూడా క్షిపణి పరీక్ష నిర్వహించింది. అమెరికా ప్రధాన భూభాగాన్ని ఇది తాకగలదని జపాన్ రక్షణ శాఖ మంత్రి యసుకజు హమదా పేర్కొన్నారు. ఈ మిసైల్ 15,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కొట్టి పడేయగలదన్నారు. ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం రెండు వారాల వ్యవధిలో రెండోసారి. ఈ క్షిపణి జపాన్ కు చెందిన హొక్కయిదో దీవి ఉత్తరాన ఒషిమా-ఒషిమా పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ అయింది. ఇది తమ సముద్ర జలాల్లో పడినట్టు జపాన్ ప్రధాని కిషిదా ప్రకటించారు.

ట్యాగ్స్​