వివాదాస్పద చర్యలతో, వింతైన నిర్ణయాలతో వార్తలకెక్కే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తాజాగా ఆ దేశ పౌరులకు మరో కొత్త షరతు విధించాడు. పుట్టే బిడ్డలకు బాంబులు, గన్, శాటిలైట్ పేర్లను పెట్టాలంటూ సూచించాడు. ఈ ఆదేశాలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇప్పటికే పెట్టిన పేర్లను కూడా మార్చాలని హుకూం జారీ చేశాడు కిమ్.