కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లోని ఆలయాల పునరుద్ధరణకు సంబంధించి సాకేత్ కోర్టులో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ ప్రదేశంలో ఆలయాల పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన మద్యంతర దరఖాస్తుపై ఏఎస్ఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కుతుబ్ మినార్ అనేది 1914 నుంచి పరిరక్షణ స్మారకంగా కొనసాగుతోందన్న ఏఎస్ఐ అలాంటి చోట నిర్మాణాలను మార్చడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపింది. స్మారక చిహ్నం వద్ద ఆరాధన పునరుద్ధరణ అనుమతించబడదు అని ఏఎస్‌ఐ స్పష్టం చేసింది.