నటి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ల వివాహం వచ్చే నెల 9వ తేదీన జరగనున్నట్లు లీకైన డిజిటల్ వెడ్డింగ్ కార్డ్ ద్వారా తెలుస్తోంది. ముందుగా ప్రచారం జరిగినట్లు ఈ వివాహం తిరుపతిలో కాకుండా మహాబలిపురంలో జరగనుంది. 2015 నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది నిశ్చితార్ధం చేసుకుంది. నయనతార నటించిన నేనూ రౌడీనే షూటింగ్‌లోనే డైరెక్టర్ విఘ్నేష్‌తో ప్రేమలో పడింది. అప్పటి నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట వచ్చే నెలలో మూడుముళ్ళ బంధంలోకి అడుగుపెడుతోంది.