వాల్తేరు వీరయ్యగా ఈ సంక్రాంతికి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మెగాస్టార్ చిరంజీవి.. రిలీజ్ కు ముందే భారీ బిజినెస్ చేసేస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్, బాబీ డైరెక్టర్ గా చేస్తున్న ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను జెమినీ ఛానల్ భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్నట్టు టాక్. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కాబోతుంది. రవితేజ కీలక పాత్రలో నటించనున్నాడు.