విదేశాల్లో ఉండే భారతీయులు, భారత సంతతి వ్యక్తులు సైతం యూపీఐ సేవలను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించనున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. భారతీయ బ్యాంకుల్లో ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ వో ఖాతాలున్న వారు యూపీఐ ద్వారా చెల్లింపులు, నగదు సేవలను వినియోగించుకోవచ్చు. విదేశాల్లో ఉండే వారికి అక్కడి ఫోన్ నంబర్లు ఉంటాయి. ఆ ఫోన్ నంబర్లకు అనుసంధానమైన ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ వో ఖాతాలకు లింక్ చేసి, యూపీఐ సేవలను పొందొచ్చు. దీంతో యూపీఐ సేవల కోసం భారతీయ సిమ్ కార్డు అవసరం లేదు.