దేశంలో రూ.2 వేల నోట్ల చలామణీ తగ్గుతోందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. కరెన్సీ నోట్లలో వీటి సంఖ్య 214 కోట్లకు తగ్గిందని తెలిపింది. 2021 మార్చి చివరి నాటికి 245 కోట్ల 2 వేల నోట్లు చలామణిలో ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 214 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. మొత్తం కరెన్సీ విలువలో రూ.2 వేల నోట్ల విలువ 17.3 శాతం నుంచి 13.8 శాతానికి పడిపోయినట్లు పేర్కొంది. అదే సమయంలో రూ.500 నోట్ల చలామణి పెరిగిందని, రూ.4,554.68 కోట్ల రూ.500 నోట్లు చలామణిలో ఉన్నాయని పేర్కొంది.