దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం ఆదివారం మధ్యాహ్నానికి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపానును అసానీ గా పిలవనున్నట్లు చెప్పిన ఆ శాఖ.. వాయువ్యం దిశగా కదులుతూ శ్రీకాకుళం–ఒడిశాల మధ్య 10వ తేదీన తీరం దాటనుందని పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు పడతాయని, గంటకు 40–50 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.