ఒడిశాలో 14 రోజుల లాక్​డౌన్​

By udayam on May 2nd / 6:17 am IST

పొరుగు రాష్ట్రం ఒడిశాలో మే 5 నుంచి 14 రోజుల లాక్​డౌన్​ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 5 నుంచి మే 19 వరకూ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ప్రజలకు దుకాణాలకు వెళ్ళడానికి అనుమతులు ఇచ్చినా కూడా ఎవరూ 500 మీటర్లకు మించి దూరం ప్రయాణించకూడదని షరతు పెట్టింది. గడిచిన 24 గంటల్లో ఒడిశాలో కొత్తగా 8,015 కేసులు రాగా 14 మరణాలు సంభవించాయి.