ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు గురువారం భారీగా పతనమయ్యాయి. సౌదీ అరేబియాతో పాటు ఒపెక్ సభ్య దేశాలు క్రూడాయిల్ ఉత్పత్తిని భారీగా పెంచాలని నిర్ణయించడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో బ్రెంట్ క్రూడ్ ధరలో 2.07 డాలర్లు అంటే 1.8 శాతం తగ్గుదల కనిపించింది. దీంతో బ్యారెల్ ఒక్కింటి ధర 114.22 డాలర్లకు పడిపోయింది. బుధవారం సైతం క్రూడాయిల్ ధరలో 2.21 డాలర్ల తగ్గుదల కనిపించింది.