ఓలా తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ను తెలంగాణలో పెట్టాలని ఆలోచన చేస్తోంది. సిఎన్బిసి టి18 రిపోర్ట్ ప్రకారం రూ.10 వేల కోట్లతో పెట్టనున్న ఈ ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీ కోసం 1000 ఎకరాల ల్యాండ్ కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోనూ భూ కేటాయింపుపై ఓలా చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. తమిళనాడులో ఈ కంపెనీ 500 ల ఎకరాల స్థలంలో టూ వీలర్ ప్లాంట్ను నిర్వహిస్తోంది.