దేశవ్యాప్తంగా ఓలా కంపెనీ తయారు చేసిన ఈ–స్కూటర్లు కాలిపోతుండడంపై ఆ సంస్థకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నేడు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ–స్కూటర్లకు మంటలు అంటుకున్న వేళ ప్యూర్ ఈవీ, బూమ్ మోటార్స్ కంపెనీలకూ కూడా సీసీపీఏ గత నెలలోనే నోటీసులు జారీ చేసి సమాధానాలు చెప్పాలని ఆదేశించింది. బైక్ లు అంటుకుంటున్న సమయంలోనే ఓలా గత నెలలో 1,441 ఈ–స్కూటర్లను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.