ఓలా ఫ్యూచర్​ ఫ్యాక్టరీలో మొత్తం మహిళలే

By udayam on September 13th / 1:15 pm IST

‘ఆత్మ నిర్భర్​ భారత్​కు ఆత్మనిర్భరత ఉన్న మహిళలు అవసరం’ అంటున్నారు ఓలా సంస్థ సిఈఓ భావిష్​ అగర్వాల్. తమిళనాడులో ఓలా సంస్థ నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్​ టూ వీలర్​ ప్లాంట్​ను మొత్తంగా మహిళలే నడుపుతారని ఆయన తాజాగా ప్రకటించారు. ఈ మేరకు మొదటి విడతగా కంపెనీలోకి వస్తున్న మహిళలకు ఆయన స్వాగతం పలుకుతూ ట్వీట్​ చేశారు. మొత్తంగా ఈ ప్లాంట్​లో 10 వేల మంది మహిళలు పనిచేయనున్నారు. వీరి సాయంతో సెకనుకు 2 ఎలక్ట్రిక్​ స్కూటర్లను తయారు చేయాలని ఓలా లక్ష్యంగా పెట్టుకుంది.

ట్యాగ్స్​