18 నెలల్లోనే ఎలక్ట్రిక్ కార్ : ఓలా

By udayam on August 16th / 5:51 am IST

2024 నాటికి ఓలా నుంచి ఎలక్ట్రిక్ కార్ ను తీసుకొస్తామని ఆ సంస్థ అధినేత భవేష్ అగర్వాల్ ప్రకటించారు. 2026–27 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ‘ముందుగా ప్రీమియం కారుతో మొదలుపెడుతున్నాం. ఇది 18–24 నెలల్లో వస్తుంది. ఎంట్రీ స్థాయి కార్లను కూడా కచ్చితంగా ప్రవేశపెడతాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఈ కారుకు ఒకసారి చార్జి చేస్తే 500 కిలోమీటర్ల పైగా నడిచే సామర్థ్యం ఉండగలదని, 4 సెకన్లలోనే 0–100 కి.మీ. వేగాన్ని అందుకోగలదని అగర్వాల్‌ చెప్పారు.

ట్యాగ్స్​