రూ.100 నోట్ల రద్దుపై గందరగోళం

By udayam on January 24th / 6:33 am IST

న్యూఢిల్లీ: పాత రూ. 100, రూ. 10, రూ. 5 నోట్లను భారతీయ రిజర్వు బ్యాంకు  వెనక్కి తీసుకోబోతోందన్న వార్త గత రెండు రోజులుగా విపరీతంగా వైరల్ అయింది.

మార్చి, ఏప్రిల్ నాటికి చెలామణి నుంచి వీటిని పూర్తిగా తప్పించాలని ఆర్‌బీఐ నిర్ణయించినట్టు  ప్రధాన మీడియాలోను, సోషల్ మీడియాలోనూ వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇది సహజంగానే ప్రజలు మరోమారు ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి నుంచే ఆయా నోట్లను తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. జనాలను ఇంతగా భయపెడుతున్న ఈ  వార్త గురించి  ఆర్‌బీఐ నుంచి  ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే డిస్ట్రిక్ట్ లెవల్ సెక్యూరిటీ కమిటీ (డీఎల్‌ఎస్‌సీ), డిస్ట్రిక్ట్ లెవల్ కరెన్సీ మేనేజ్‌మెంట్ కమిటీ (డీఎల్ఎంసీ) సమావేశంలో ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) బి మహేశ్ ఇలా అన్నారు.

రూ. 100, రూ.10, రూ.5 పాత కరెన్సీ నోట్లను మార్చి, ఏప్రిల్ నాటికి చెలామణి నుంచి తప్పించాలని ఆర్‌బీఐ యోచిస్తున్నట్టు చెప్పారని పలు మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.

అయితే ఇప్పటికే పాత నోట్ల స్థానంలో రూ. 100, రూ.10, రూ. 5 నోట్ల స్థానంలో కొత్త నోట్లు వచ్చేసాయి కదా అని వ్యాఖ్యానించారు.

రూ.10 నాణం సంగతేంటి ?

ఇక 10 రూపాయల నాణేన్ని తీసుకొచ్చి 15 ఏళ్లు అయినప్పటికీ ఇప్పటికీ వీటిని ఎవరూ తీసుకోవడం లేదు. ఈ నాణాన్ని  రద్దు చేసినట్టు గతంలో వార్తలు రావడమే ఇందుకు కారణం.

ఈ విషయంలో రిజర్వు బ్యాంకు పలుమార్లు వివరణ ఇస్తూ, రూ.10 నాణేలను తీసుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. అయినప్పటికీ, వీటిని  తీసుకునేందుకు ఎవరూ అంగీకరించడం లేదు.

ఇప్పుడు పాత నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్టు వస్తున్న వార్తలు జనాన్ని మరింత గందరగోళంలోకి నెట్టాయి.

ట్యాగ్స్​