అద్భుతం: బ్లడ్​ క్యాన్సర్​కు చికిత్స చేస్తే హెచ్​ఐవి మాయం

By udayam on July 29th / 4:55 am IST

దాదాపు 35 ఏళ్ళుగా హెచ్​ఐవీతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆ వైరస్​ బారి నుంచి పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు ప్రకటించారు. అతడికి సోకిన బ్లడ్​ క్యాన్సర్​ వ్యాధికి బోన్​మారో ట్రాన్స్​ప్లాంట్​ను ఇటీవలే చేశారు. దీంతో ఈయన శరీరంలో హెచ్​ఐవి కణాలు పూర్తిగా మాయమవడాన్ని డాక్టర్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. ఇలా హెచ్​ఐవి నుంచి పూర్తిగా కోలుకున్న ప్రపంచంలోనే 4వ వ్యక్తిగా ఈ 66 ఏళ్ళ వ్యక్తి రికార్డు సృష్టించాడు. 1988 నుంచి ఈయన హెచ్​ఐవితో చికిత్స తీసుకుంటున్నాడు.

ట్యాగ్స్​