చాలా కాలంగా వెదుకుతున్న కరడుగట్టిన ఉగ్రవాది అష్రఫ్ మోల్వీని ఎట్టకేలకు భద్రతాదళాలు శుక్రవారం మట్టుబెట్టాయి. అతడితో పాటు హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్లో హతమయ్యారు. అమర్నాథ్ యాత్రలో తీవ్ర అలజడి సృష్టించడానికి వీరంతా ప్లాన్ చేశారని మాకు పక్కా సమాచారం ఉందని కశ్మీర్ జోన్ ఐజి విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. పహల్గామ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ విజయవంతం అయిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.