డిఎస్పీగా బాక్సర్​ లవ్లీనా

By udayam on January 12th / 10:07 am IST

భారత యువ బాక్సర్​, ఒలింపిక్​ మెడల్​ విన్నర్​ లవ్లీనా బోర్గోహెయిన్​కు ఈరోజు డిఎస్పీగా ఉద్యోగం ఇచ్చారు. అస్సాంకు చెందిన ఈమె ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు ఈరోజు అస్సాం సిఎం హిమంత బిశ్వ శర్మ డిఎస్పీ ఉద్యోగాన్ని అందించారు. 24 ఏళ్ళ లవ్లీనా డిఎస్పీగా ఎంపికైనప్పటికీ ఆమె తన ప్రాక్టీస్​కు ఎలాంటి అడ్డంకి ఉండదని అస్సాం పోలీస్​ డిపార్ట్​మెంట్​ ప్రకటించింది.

ట్యాగ్స్​