ఒమిక్రాన్ కొవిడ్ వేరియంట్ మానవ శరీరంపై ఒకరోజు జీవించి ఉంటుందని అయితే ఏదైనా ప్లాస్టిక్ పదార్థాలపై మాత్రం ఈ వైరస్ 8 రోజుల పాటు జీవించగలుగుతోందని పరిశోధనలో తేలింది. ఇందువల్లనే ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారగలుగుతోందని జపాన్ పరిశోధకులు వెల్లడించారు. ఆల్ఫా 56 గంటలు, బీటా 191.3 గంటలు, గామా 156.6 గంటలు, డెల్టా 114.0 గంటలు బతికితే ఒమిక్రాన్ 193.5 గంటల పాటు పరిసరాల్లో ఎక్కువగా మనగలుగుతోందన్నారు.