2021లో దేశంలో మొత్తం 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని లోక్‌సభలో కేంద్రం ప్రకటించింది. గతేడాది ప్రతిరోజూ 115 మంది రోజువారీ కూలీలు, 63 మంది గృహిణులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి నిత్యానంద రాయ్ అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా మొత్తం 42,004 మంది రోజువారీ కూలీలు, 23,179 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మొత్తంగా 20,231 మంది స్వయం ఉపాధి పొందేవారు, 15,870 మంది ఉద్యోగులు, 13,714 మంది నిరుద్యోగులు, 13,089 మంది విద్యార్థులు, 12,055 మంది వ్యాపారులు, 11,431 మంది ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసేవారు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.