ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ఉన్న 54 వేల లౌడ్స్పీకర్లను యోగి సర్కార్ తొలగించింది. మరో 60 వేల లౌడ్స్పీకర్లలో సౌండ్‌ను తగ్గించినట్లు పేర్కొంది. ఈ పనిని కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే యోగి సర్కార్ పూర్తి చేశామని ఆ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ ఎడిజి ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా ఉన్న అన్ని లౌడ్ స్పీకర్లపైనా తాము చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.