తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని పందలపర్రు గ్రామంలో తేనెటీగలు దాడి చేయడంతో ఓ వ్యక్తి మరణించాడు. మరో 5 గురికి తీవ్ర గాయాలయ్యాయి. కూలి పనుల్లో ఉండగా వీరిపైకి తేనెటీగల ముసురుకు రావడాన్ని గమనించిన వారు సురక్షిత ప్రాంతాలకు పరిగెత్తారు. వృద్ధుడైన వెలిగేటి గన్నయ్య పరిగెత్తలేక పడిపోయాడు. దీంతో అతడిపై తేనెటీగలు దాడి చేయడంతో అతడి అక్కడికక్కడే మరణించాడు. గాయపడ్డ వారిని నిడదవోలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.