తెలంగాణలో భారీ స్థాయిలో హైబీపీ కేసులు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిపిన జీవనశైలి వ్యాధుల స్క్రీనింగ్‌లో ఈ విషయం బయటపడింది. 80 లక్షల మందికి జరిపిన పరీక్షల్లో 13 లక్షల మందికి పైగా అధిక రక్తపోటుతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవం సందర్భంగా గ్లెనిగల్ గ్లోబల్ ఆసుపత్రి, జాతీయ పోషకాహార సంస్థ, కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యోన ఫలితాలను మంత్రి హరీష్ రావు విడుదల చేశారు.