వన్​ప్లస్​ నుంచి 9 ఆర్​టి స్మార్ట్​ఫోన్​

By udayam on October 9th / 6:52 pm IST

వన్​ప్లస్​ తన 9 సిరీస్​లో మరో స్మార్ట్​ఫోన్​ను విడుదల చేయనుంది. ఇప్పటికే వన్​ప్లస్​ 9 ఆర్​ను రిలీజ్​ చేసిన ఈ సంస్థ తాజాగా 9 ఆర్​టి మోడల్​ను తీసుకురానుంది. ఈనెల 13న చైనాతో పాటు భారత్​లోనూ ఒకేరోజు దీనిని లాంచ్​ చేయడానికి సిద్ధమవుతోంది. రూ.35 వేల ప్రారంభ ధరతో ఈ ఫోన్​ అందుబాటులోకి రానుంది. 6.55 ఇంచ్​ ఫుల్​ హెచ్​డి, 120 హెర్ట్జ్​ రిఫ్రెష్​ రేట్​, 50, 16, 2 ఎంపి ట్రిపుల్​ కెమెరాతో పాటు 16 ఎంపి సెల్ఫీ కెమెరా, 8+128 జిబి స్టోరేజ్​, 4500 బ్యాటరీ సదుపాయాలు కల్పించనుంది.

ట్యాగ్స్​