ఒప్పో తన తర్వాతి తరం ప్రీమియం మోడల్ ఫోన్ ను ఈనెల 24న లాంచ్ చేయనుంది. రెనో 9 సిరీస్ తో వస్తున్న ఈ ఫోన్ లో రెనో 9, 9 ప్రో, 9 ప్రో+ వర్షన్లు ఉన్నాయి. ఈనెల 24న చైనాలో ముందుగా లాంచ్ అవుతున్న ఈ ఫోన్ వచ్చే నెల మొదట్లో భారత మార్కెట్ లోకి విడుదల కానుంది. రెనో 8 సిరీస్ లో ఉన్నట్లే ఈ కొత్త వర్షన్ లోనూ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. 5000 బ్యాటరీ, 50 ఎంపి ప్రైమరీ, 8 ఎంపి సెకండరీ, 2 ఎంపి డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉండనున్నాయి.