వచ్చే నెల 18న జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆశ ఆదిలోనే ఆవిరైంది. బెంగాల్ సిఎం మమతా బెనర్జీ అధ్యక్షతన ఢిల్లీలో 16 ప్రధాన పార్టీల మధ్య జరిగిన ఈ సమావేశంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును మమత ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదనను శరద్ పవార్ అక్కడికక్కడే తిరస్కరించారు. క్రియాశీల రాజకీయాలంటేనే తనకిష్టమని, ఇక్కడ ఇంకా ఇన్నింగ్స్ ఆడుతున్నానని ఆయన మమత అభ్యర్థనను తిరస్కరించారు.