5:04 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

ఇకపై ఓటిపి చెబితేనే వంటగ్యాస్​ డెలివరీ 2 weeks ago

న్యూఢిల్లీ : వంట గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీలో అక్రమాలను నిరోధించేందుకు సరికొత్త విధానం అమల్లోకి వచ్చింది. సరైన కస్టమర్‌కే సిలిండర్ అందే విధంగా చేయడం కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. డెలివరీ ఆథంటికేషన్ కోడ్ ద్వారా అసలు కస్టమర్‌ను గుర్తించి, సిలిండర్‌ను డెలివరీ చేస్తారు.

లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్‌ను ఇంటి వద్దకే రప్పించుకోవాలనుకునే కస్టమర్స్‌కు వచ్చే నెల 1 నుంచి ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్)ను పంపిస్తారు.

సిలిండర్లను డెలివరీ చేసే సిబ్బందికి ఈ ఓటీపీని తెలియజేసి, సిలిండర్‌ను తమ ఇంటి వద్ద పొందవచ్చు. ఈ విధానాన్ని ముందుగా 100 స్మార్ట్ సిటీలలో అమలు చేస్తారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో అమలు చేస్తున్నారు.