ప్రభాస్​ షో కోసం ఎగబడ్డ నెటిజన్లు.. ఆహా సర్వర్లు క్రాష్​

By udayam on December 30th / 5:31 am IST

బాలయ్య డిజిటల్​ షో అన్​ స్టాపబుల్​ సీజన్​ 2 లో నిన్న పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ ఎపిసోడ్​ టెలికాస్ట్​ అయింది. దీంతో ప్రభాస్​ ఫ్యాన్స్​ తో పాటు నెటిజన్లు ఈ యాప్​ పై ఒకేసారి లాగిన్​ అవ్వడంతో ఈ ప్లాట్​ ఫాం సర్వర్లు క్రాష్​ అయ్యాయి. ఇప్పటికే ఈ షోను కేవలం బాలయ్య కోసమే చూస్తున్న అభిమానులకు ప్రభాస్​ కూడా జత కావడంతో వారి ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. ట్రైలర్​, టీజర్ల నుంచే ఈ షో కు క్రేజ్​ ఓ రేంజ్​ లో ఉండగా టెలికాస్ట్​ టైంలో ఫ్యాన్స్​ తుఫానులా ఈ యాప్​ పై పడ్డారు.

ట్యాగ్స్​