21,000 బ్యాటరీతో ఔకిటెల్​ ఫోన్​

By udayam on June 2nd / 10:45 am IST

భారీ బ్యాటరీతో ఐకిటెల్​ డబ్ల్యూపి 19 అనే స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోకి వచ్చింది. ఏకంగా 21 వేల మిలియన్​ యాంప్​ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్​ 36 గంటల పాటు వీడియో ప్లే బ్యాక్​ సపోర్ట్​ చేయనుంది. వీడియోలు చూడకపోతే ఈ ఫోన్​ బ్యాటరీ వారం పాటు పనిచేస్తుందని ఈ సంస్థ పేర్కొంది. 8+256 స్టోరేజ్​తో వస్తున్న ఈ ఫోన్​లో 64 ఎంపి మెయిన్​ కెమెరా ఉంది. ధర మాత్రం రూ.48,000లుగా పేర్కొంది. 6.78 ఫుల్​ హెచ్​డి+, ఆండ్రాయిడ్​ 12 ఆపరేటింగ్​ సిస్టమ్​తో ఈ ఫోన్​ పనిచేస్తుంది.

ట్యాగ్స్​