పెళ్ళిలో 2 కోట్ల నగలు మాయం

By udayam on November 27th / 6:09 am IST

ఓ భారీ వివాహ వేడుకలో దొంగలు చొరబడి దాదాపు 2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, 95 వేల నగదును దోచుకెళ్ళారు. రాజస్థాన్​లోని ఓ ఫైవ్​స్టార్​ హోటల్​లో జరిగిన ఈ భారీ చోరీపై ప్రస్తుతం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ముంబైకి చెందిన వ్యాపారి రాహుల్​ భాటియా వివాహం ఈ హోటల్​లో జరుగుతుండగా ఆ కుటుంబం మొత్తం అదే హోటల్​లోని 7వ అంతస్తులో బస చేసింది. ఇదే అదనుగా దొంగలు తమ చేతి వాటాన్ని చూపారు. హోటల్​ సిబ్బంది సహకారంతోనే ఈ దొంగతనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్​