పాక్​ వరదల్లో 1500ల మంది మృతి

By udayam on September 20th / 6:33 am IST

పాకిస్థాన్​కు ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదల్లో మరణించిన వారి సంఖ్య 1545గా ఉందని ఆ దేశ విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. మరణించిన వారిలో 552 చిన్నారులు, 315 మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది. మరో 12,860 మంది గాయపడ్డ ఈ ప్రకృతి వైపరీత్యంలో ఒక్క సింధ్​ ప్రావిన్స్​లోనే 678 మంది మరణించారు. ఖైబర్​ పఖ్తుంక్వాలో 306, నైరుతి బలూచిస్తాన్​లో 299 మంది మరణించారు. 19,43,978 ఇళ్ళు దెబ్బతినగా.. 9,43,909 టన్నుల పంట కొట్టుకుపోయింది. 12,735 కి.మీ.ల రోడ్లు, 375 బ్రిడ్జిలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తం 3.30 కోట్ల మంది పాకిస్థానీయులు ఈ వరదలకు ప్రభావితమయ్యారు.

ట్యాగ్స్​