1900 వెండి ఇటుకలు స్వాధీనం

By udayam on May 9th / 1:33 pm IST

బస్సులో తరలిస్తున్న 1900 కేజీల వెండి ఇటుకలు, ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​లో జరిగిన ఈ ఘటనలో 450 కేజీల వెండిని, 772 కేజీల వెండి ఆభరణాలను సీజ్​ చేశామని పోలీసులు తెలిపారు. సరైన పత్రాలు లేకుండా బస్సు నడుస్తోందని గుర్తించి ఆపై బస్సులో తనిఖీలు చేపట్టగా ఈ వెండి అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టయిందని పేర్కొన్నారు. మొత్తం 1222 కేజీల వెండి విలువ బహిరంగ మార్కెట్​లో 8 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

ట్యాగ్స్​