రిపోర్ట్​: రైల్వేలో 3.12 లక్షల ఖాళీలు

By udayam on January 12th / 6:03 am IST

భారతీయ రైల్వేలో 3.12లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయని, దీంతో రైల్వేలో సిబ్బంది కొరత తీవ్రస్థాయిలో ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాల్ని ఊటంకిస్తూ ఆంగ్ల దినపత్రిక ఒకటి వార్తా కథనం వెలువరించింది. సిబ్బంది కొరత వల్ల రైల్వేలో ఉద్యోగులపై పని ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉందని, ఓవర్‌టైమ్‌ పనిచేయాల్సి వస్తోందని తెలిపింది. ఉద్యోగ ఖాళీలను సాకుగా చూపుతూ ఔట్‌సోర్సింగ్‌ విధానంలో సిబ్బందిని నియమిస్తున్నారని రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ట్యాగ్స్​